ఘనంగా జరిగిన కాట్స్ వారి ” విజయ నామ సంవత్సర ఉగాది సంబరాలు “

Ugadi celebrations- 2013, CATS

Teluguonline(TOL)- Telugu Community Event- Apr.14.2013:

* అమెరికా రాజధాని ప్రాంతం లో నివసించే తెలుగు వారికి ,ఉగాది పండుగ సందర్భంగా , కాట్స్ వారి కానుక ” ఫ్యామిలి హెల్ప్ లైన్ ” – 1-800-274-1242 or helpline@theuscats.org, సేవా కార్యక్రమముప్రకటించారు.

CATS Family Helpline

 

రాజధాని ప్రాంతీయ తెలుగు సంఘము వారి విజయ నామ సంవత్సర ఉగాది సంబరాలు, రూస్వేల్ట్ హై స్కూల్ , వాషింగ్టన్ డి సి మహానగరం లో, శనివారం, ఏప్రిల్ ,13 వ తేది ఘనం గా జరిగాయి. వేదికను,తెలుగుతనము ఉట్టి పడేలా, అలంకరించారు. విజయ నామ సంవత్సర పంచాంగ శ్రవణం, సభికులను అలరించింది. అందరికి, రుచికరమైన ఉగాది పచ్చడి, పలహారాలు పంచారు. ఈ కార్యక్రమానికిస్థానికంగా ఉండే 1200 మంది ప్రవాసాంధ్రులు, యువతీ, యువకులు, మహిళలు , పెద్దలు,పిల్లలు తెలుగు సాంప్రదాయ దుస్తులతో, ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొన్నారు . 260 మంది స్థానిక తెలుగుపిల్లలతో, తెలుగు సాంప్రదాయ, జానపథ పాటల నృత్యాలతో కన్నుల పండుగ గా జరిగాయి . ఘుమ ఘుమలాడే , సాంప్రదాయ విందు భోజనం వడ్డించారు.శంకరాభరణం, మంజు భార్గవి నృత్యము తోమైమరిపించినది. అందాల వర్ధమాన గాయని , సూపర్ సింగర్ గురు ” సుమంగళి “, గాయకుడు, తెలుగు వాయిస్ అఫ్ అమెరికా ” గోపీనాథ్ ” ప్రత్యేక పాట లతో, ప్రేక్షకులను ఉర్రుతలూగించారు.

కాట్స్ వారి ” ఫ్యామిలి హెల్ప్ లైన్ “: రాజధాని ప్రాంతములో నివసించే తెలుగు వైద్యులు , న్యాయవాదులు , తెలుగు సామాజిక పెద్దలు ‘ఫ్యామిలి హెల్ప్ లైన్” కూటమి లో  సభ్యులు . సహాయము కావలసిన,రాజధాని ప్రాంతములో నివసించే తెలుగు వారు , ” ఫ్యామిలి హెల్ప్ లైన్ ” – 1-800-274-1242 or helpline@theuscats.org సంప్రదించండి for Guidance or information onFamily relationships related situations , Dealing with teenage and college age children communication issues ,Domestic situation related and you need legal services  and Medical information

కాట్స్ అధ్యక్షులు భువనేష్  బూజాల గారు, ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ కాట్స్ సంస్థ చేస్తున్న పలు సామాజిక కార్యక్రమాలను నివేదించారు.ఈ కార్యక్రమం విజయవంతం కావడంలోఎనలేని కృషి చేసిన కార్య నిర్వాహక సభ్యులు మధు కొల, ప్రవీణ్ కట్టంగూర్,శ్రీలేఖ రెడ్డి ,అపర్ణ మట్టపల్లి,బద్రి చల్ల,భాస్కర్ బొమ్మా రెడ్డి,అమరేందర్ రెడ్డి బొజ్జ , వెంకట్ గుండ, సుధా రాణి ,గోపాల్ నున్న,అనిల్రెడ్డి, గౌడ్ రాంపురం ,నరసింహ రెడ్డి , సత్యజిత్ రెడ్డి , ప్రసాద్ వేదటి, శ్రీధర్ బాణాల, ప్రసాద్ మట్టపల్లి,సుధాకర్ బచ్చు, హరీష్ కుమార్, సోమేశ్వర్, రాజి రెడ్డి , రాకేష్ , పద్మ లత , ఉమాకాంత్ ,వెంకట చిక్యల్ ,మహేశ్  చించోడ్ ,సుదర్షన్ దేవిరెడ్డి , బాబు గుమ్మడి , విశ్వా మోహన్ రెడ్డి ,ఈశ్వర్ మేడం ,రఘు వెదిరె ,కృష్ణ కటకం,విజయ్  తాళ్ళ ,ప్రవీణ్ ఎర్రంరెడ్డి, చంద్ర చింతపర్తి , రామ్ మోహన్ కొండ ,చిత్తరంజన్ నల్లు, నర్సింగ్ రావు, జ్యోతి ,అనంత లలక్ష్మి మొదలగు వారికి కృతజ్ఞతలు తెలియజేసారు.అలాగే ఈ కార్యక్రమం ఇంత భారీ ఎత్తున నిర్వహించడంలో ముందుకు వచ్చిన దాతలను పేరు పేరున కొనియాడి ట్రోఫీలు అందజేశారు.

చివరగా  అద్యక్షుడు  దాతలకు, పోషక దాతలకు, విచ్చేసిన అతిథులకు, కళాకారులకు, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్న వారికి, ప్రేక్షకులకు, కార్యకర్తలకు, యాజమాన్యానికి, మీడియా కు కృతఙ్ఞతలు తెలియజేసా రు.వందన సమర్పణతో , పిదప వర్ధమాన గాయని సుమంగళి జాతీయ గీతాలాపనతో , కాట్స్ ఉగాది వేడుకలు ఘనంగా ముగిసాయి.

 

Comments

comments

Powered by Facebook Comments

Photo Gallery

Contact: CEO- venu@teluguonline.net, you can send your articles to editor@teluguonline.net; Marketing, to Advertise in the teluguonline.net, contact, 1-240-294-5438


Copyright ©2009-2012,www.teluguonline.net, All rights reserved.